శిశుమందిర్‌లో ఆకట్టుకున్న జిల్లాస్థాయి గణిత విజ్ఞానమేళా
ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి గణిత విజ్ఞానమేళా విశేషంగా ఆకట్టుకుంది.
నారాయణపేట జిల్లాలోని ఏడు శిశు మందిర్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు గణిత విజ్ఞానమేళాలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. నారాయణపేట శిశు మందిర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రూపొందించిన ఫ్రిజ్, వాషింగ్ మెషిన్, రైస్ కుక్కర్‌తో పాటు నిత్యజీవితంలో ఉపయోగించే వివిధ సరళ యంత్రాల నమూనాలు సందర్శకులను ఆకర్షించాయి.
జిల్లాస్థాయి విజ్ఞానమేళాను తిలకించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్ కుమార్, సర్పంచ్ రేణుక భరత్, పాఠశాల అధ్యక్షులు భాస్కర్, జిల్లా అధ్యక్షులు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.
