బాలల గ్రామసభ హామీ అమలు..
విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ
జైనూర్, ఆంధ్రప్రభ: జైనూర్ మండలంలోని పవర్‌గూడ గ్రామంలో నిర్వహించిన బాలల గ్రామసభలో ఇచ్చిన హామీని గ్రామ సర్పంచ్ తొడసం రాజేందర్ కార్యరూపంలోకి తీసుకొచ్చారు. మంగళవారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు విద్యాసామగ్రితో పాటు క్రీడా కిట్లను పంపిణీ చేశారు.
విద్యార్థులకు పెన్నులు, నోట్‌బుక్స్, పెన్సిళ్లు, కంపాస్ బాక్సులతో పాటు వాలీబాల్, క్రికెట్ కిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ తొడసం రాజేందర్ మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. వారి అవసరాలను గుర్తించి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కిషోర్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు ఆత్రం తిరుమల్లేశ్వర్, ఉపాధ్యాయులు జాయ లలిత, మంగరాణి, గ్రామ పెద్దలు అనకార్ అంజి పటేల్, సుదర్శన్, కారోబర్ ఉయిక జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
