ఫ్లైఓవర్ ప్రారంభించాలని బిఆర్ ఎస్ నాయకుల ధర్నా…

నల్గొండ ఆంధ్రప్రభ :-పూర్తయి రెండు నెలలు గడుస్తున్న ప్రారంభించడం లేదని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ నాయకులతో కలిసి మర్రిగూడ ఫ్లైఓవర్ పై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ నాయకుల నిర్లక్ష్యంతో.. ఫ్లై ఓవర్ ఏర్పాటు చేయకపోవడంతో మర్రిగూడ బైపాస్, పానగల్ బైపాస్ ల వద్ద అనేక ప్రమాదాలు పదుల సంఖ్యలో మరణాలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్లడంతో స్పందించిన కేసీఆర్ రెండుచోట్ల బైపాస్ లకు నిధుల మంజూరు చేయడం జరిగిందన్నారు. పానగల్ బైపాస్ పూర్తయి ఎప్పుడో ప్రారంభించడం జరిగిందని మర్రిగూడ బైపాస్ వద్ద రాజకీయ కారణాలతో పూర్తయిన ఫ్లైఓవర్ను.. ప్రారంభించకపోవడంతో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు దృష్టికి తేవడంతో…. నిరసన వ్యక్తం చేయడం జరిగింది అన్నారు.

పోలీసుల రంగ ప్రవేశం తో తీవ్ర ఉద్రిక్తత...
కలెక్టర్ వచ్చి సమస్యను పరిష్కరించేంతవరకు తాము ఇక్కడి నుంచి లేసేది లేదని బిస్మించుకున్న సందర్భంగా తీవ్ర ఉద్రిక్తల నడుమ . డీఎస్పీ ఆధ్వర్యంలో కంచర్ల, మాజీ ఆర్వో మాలే శరణ్యారెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, పలువురు కార్పొరేటర్లు, మండల పార్టీ అధ్యక్షులు మాజీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి మల్లెపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెండు గంటలపాటు జరిగిన ధర్నా కార్యక్రమం లో రోడ్డు ఇరువైపులా నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి .