విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ

మోత్కూర్, ఆంధ్రప్రభ ; పదవ తరగతి అంటేనే బాల్య దశ అని, ఈ దశలోనే క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానాలకు ఎదగవచ్చని మున్సిపల్ వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న అన్నారు. శుక్రవారం మున్సిపల్ కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న 103 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్నులు ఇతర సామాగ్రిని అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దేవినేని అరవిందరాయుడు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
