ధర్మమే గెలిచింది: అక్కల రామరెడ్డి
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల నియోజకవర్గం పిట్టల వాని పాలెం మండలంలో 2020 నుండి చింతాడ ఆనంద్, పాస్టర్ అనిల్ కలిసి బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతూ, తన పూర్వీకుల భూమిని ఆక్రమించుకునేందుకు తనపై, గ్రామస్థులపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారని బిజెపి మండల అధ్యక్షులు అక్కల రామిరెడ్డి ఆరోపించారు.
ఆ కేసుపై తాను హైకోర్టును ఆశ్రయించగా, 2025 ఏప్రిల్ 30న కేసును క్వాష్ చేసినట్లు తెలిపారు. అనంతరం ప్రత్యర్థులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రత్యేక పిటిషన్‌ను కూడా విచారించిన సుప్రీంకోర్టు, 2026 మార్చి 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ కేసును క్వాష్ చేసిందని చెప్పారు.
తదనంతరం దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కూడా నేడు కొట్టివేయబడిందని తెలిపారు. తనపై తప్పుడు కేసు బనాయించిన వారిపై రూ.1 కోటి పరిహారం కోరుతూ పరువు నష్టం దావా వేస్తానని, అలాగే అప్పట్లో వారికి సహకరించిన అధికారులు, తప్పుడు సాక్ష్యాలు చెప్పిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధర్మమే గెలిచింది అంటూ న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
