గోవాకు గట్టి పోటీ… వైజాగ్ తరహాలో బాపట్ల!
బాపట్ల, ఆంధ్రప్రభ : ప్రస్తుతం గోవాలో జరుగుతున్న కొన్ని స్కామ్స్, మిస్-బిహేవియర్ల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ఈ తరుణంలో బాపట్ల- సూర్యలంక,చీరాల- రామాపురం బీచ్‌లు గోవాను తలదన్నే రేంజ్‌లో ఇంటర్నేషనల్ టూరిస్టులను సైతం అట్రాక్ట్ చేసేలా రెడీ అవుతున్నాయి.

పైగా హైదరాబాద్ నుండి ఈ బీచ్‌లకు డైరెక్ట్ కనెక్టివిటీ ఇచ్చే హైవే పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఆంధ్ర బోర్డర్ వరకు హైవే దాదాపు సిద్ధంగా ఉంది, మిగిలిన కనెక్టివిటీ కూడా పూర్తయితే… హైదరాబాద్ వాసులకు అతి తక్కువ సమయంలో చేరుకోగలిగే బెస్ట్ వీకెండ్ డెస్టినేషన్ ఇదే అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ వీకెండ్ సెలవులకు సూర్యలంక వేదికగా నిలచింది.
సూర్యలంక బీచ్‌కు రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లాలో పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని సూర్యలంక బీచ్‌కు వచ్చే పర్యాటకులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడంతో ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారని విశాఖపట్నం బీచ్ తర్వాత అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న బీచ్‌గా సూర్యలంక గుర్తింపు పొందుతుందని స్థానిక ప్రజలు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
