యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవ‌పత్రం మంజూరు..

యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవ‌పత్రం మంజూరు..

యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు-2 స్వర్ణ గ్రామం కార్యాలయం ప్రతిష్టాత్మకమైన ISO 9001:2015 సర్టిఫికేట్‌ను అందుకుని ప్రత్యేక గుర్తింపు పొందింది. గ్రామ స్థాయిలో నాణ్యమైన పరిపాలన, పారదర్శక సేవలు అందించడంలో ముందుండటంతో ఈ గౌరవం దక్కినట్లు అధికారులు తెలిపారు. యడ్లపాడు 2 స్వర్ణ గ్రామం కార్యాలయాన్ని ISO9001 -2015 సర్టిఫికేట్ కొరకు ఎబిన్ జార్జ్ ఫ్రొం టిక్యూఎస్ సర్టిఫికెట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కేరళ, ఆంధ్రప్రదేశ్ కమీషనర్ పంచాయతి రాజ్ నుండి సాయి కృష్ణ విచ్చేసి రెండు రోజులుగా ఆడిట్ నిర్వహించి, సదరు కార్యయాలయాన్ని ISO9001 -2015 సర్టిఫికేట్ కొరకు సిఫారసు చేస్తున్నామని డ్రాఫ్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం జరిగింది.

యడ్లపాడు-2 స్వర్ణ గ్రామం కార్యాలయ రికార్డ్స్ ను పరిసీలించి సిబ్బందికి తగు సూచనలు చేసినారు అనంతరం బుధవారం మండల ఎంపీడీవో మరియు గ్రామ ప్రత్యేకాధికారి వి.హేమలతా దేవి, మండల డిప్యూటీ ఎంపీడివో నాగిరెడ్డి, గ్రామ పంచాయతి అభివృద్ధి అధికారి బాపిరాజుకు ISO9001 -2015 ధృవ పత్రాన్ని కేరళ టిక్యూఎస్ సర్టిఫికెట్ సర్వీస్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎబిన్ జార్జ్ అందజేసారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా తొలి ఐఎస్9001 ధృవ పత్రాన్ని పొందిన గ్రామంగా యడ్లపాడు-2 స్వర్ణగ్రామం నిలుస్తుంది.

ఈ సందర్భంగా గ్రామ ప్రత్యేక అధికారి వి.హేమలతా దేవి మాట్లాడుతూ, గ్రామ పెద్దలు, కార్యాలయ సిబ్బంది కలిసి కట్టుగా పనిచేయడం వల్లే ఈ విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా తీసుకున్న చర్యలు ఫలితంగా ఈ సర్టిఫికేట్ లభించిందని ఆమె వివరించారు. ఇదే స్పూర్తితో భవిష్యత్తులో కూడా సేవల ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తూ, గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమానికి యడ్లపాడు గ్రామ పంచాయతి అభివృధ్హి అధికారి బాపిరాజు, స్వర్ణ గ్రామం కార్యాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు పోపూరి. రాఘవయ్య, గోనుగుంట్ల శ్రీనివాసరావు,పోపూరి. నాగేశ్వరరావు,పోపూరి వెంకటరత్తయ్య, గోనుగుంట్ల.హరిబాబు,ఉప్పలపాటి.శ్రీనివాసరావు హాజరైనారు.గ్రామ ప్రజలు కూడా ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బందిని అభినందించారు.

Leave a Reply