ఉచిత ప్రసాద పథకానికి లక్ష రూపాయల విరాళం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారి దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత ప్రసాద పంపిణీ కార్యక్రమానికి తిరుపతి ప్రాంతానికి చెందిన దాత జి సుబ్రహ్మణ్యం రెడ్డి కుటుంబీకులు ఉచిత ప్రసాదము పంపిణీ పథకానికి రూ. 1,00,116/- విరాళంగా సమర్పించారు.
వీరికి ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ దాతకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
