ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఎన్నిక..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాపురం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయ నూతన కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

దేవాలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో కమిటీ చైర్మన్‌గా తాడూరు పద్మమ్మ, కోశాధికారిగా తాడూరు రమేష్ రెడ్డి ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా తాడూరు అనంతరాం రెడ్డి, నంది కృష్ణారెడ్డి, వర్రే రాములు, అంకర్ల రమేష్, ఎర్రోజు మధనాచారి, వర్రే వెంకటయ్య, వర్రే సోమయ్య, జటంగి నరేందర్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

నూతన కమిటీ సభ్యులను మున్సిపల్ కౌన్సిలర్ నల్ల మధు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నల్ల మధు, గ్రామస్థులు, నాయకులు జినుకల కనకయ్య, ఎర్రోజు యశ్వంతాచారి, వర్రే మహేందర్, అంబటి కనకయ్య, తాడూరు శ్రీధర్ రెడ్డి, తాడూరు మధు రెడ్డి, నర్సింహా, మల్లయ్య, మాధవ రెడ్డి, నాగరాజు, అశోక్, పరుశరాములు, రాజశేఖర్ రెడ్డి, యాదయ్య, మహేష్, సురేష్ రెడ్డి, నాగయ్య, సోమయ్య, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.