NEWS@3:00 P.M | 11 జూలై 2026 ముఖ్యాంశాలు
Shabad Murders | ప్రభుత్వం వైఫల్యం వల్లే ఆరు హత్యలు…
Shabad Murders | చేవెళ్ల, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లే షాబాద్ మండలంలో ఆరు హత్యలు జరిగాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. షాబాద్ లో బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా మున్సిపల్ పరిధిలోని మల్కాపూర్ వద్ద చేవెళ్ల పోలీసులు సబితా ఇంద్రారెడ్డి, పద్మ దేవేందర్ రెడ్డిలను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఫోక్సో కేసు నమోదైనా పోలీసులు సరైన చర్య తీసుకోకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. నిందితుడు ఆరుగురిని హతమార్చడం అత్యంత బాధాకరమన్నారు. click here to read
Bullet Train | బులెట్ ట్రైన్ హబ్‌గా తెలంగాణ
Bullet Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో ప్రకటించిన ఏడు బులెట్ ట్రైన్ ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు కేటాయించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక చొరవ వల్లే ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి లభించాయని పేర్కొన్నారు. click here to read
ATM Theft | ఏటీఎంను ఈడ్చుకెళ్లి నగదు దోచేశారు
ATM Theft |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సినీఫక్కీలో ఏటీఎం దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు మహీంద్రా థార్ ఎస్యూవీ సాయంతో ఏటీఎం యంత్రాన్ని కియోస్క్ నుంచి బయటకు లాగి, అందులోని నగదును దోచుకుని పరారయ్యారు.click here to read
Blood Donation | 106వసారి రక్తదానం చేసిన ఉజ్వల్
Blood Donation |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలకు జీవం పోస్తూ ఆదర్శంగా నిలుస్తున్న మనేపల్లి ఎస్.ఉజ్వల్ అరుదైన ఘనత సాధించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో ఆయన 106వసారి రక్తదానం చేసి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. click here to read
Novak Djokovic | టెన్నిస్ దిగ్గజం జకోవిచ్
Novak Djokovic | ఆంధ్ర్రప్రభ వెబ్‌డెస్క్ : ప్రపంచ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ తన రిటైర్మెంట్పై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. ప్రస్తుతం తాను ఆటకు వీడ్కోలు చెప్పే ఆలోచనలో లేనని స్పష్టం చేశారు. శారీరకంగా పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉన్నానని, టెన్నిస్‌ను ఆస్వాదిస్తున్నంత కాలం కోర్టులో కొనసాగుతానని వెల్లడించారు.click here to read
TG Engineers Day | తెలంగాణ ఇంజనీర్లకు శుభాకాంక్షలు
TG Engineers Day | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలో అనేక నీటిపారుదల ప్రాజెక్టుల రూపకల్పనతో పాటు పలు చారిత్రక నిర్మాణాలకు మార్గదర్శకత్వం వహించిన ప్రముఖ ఇంజనీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ రోజు తెలంగాణ ఇంజనీర్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని ఇంజనీర్లందరికీ ముఖ్యమంత్రి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. click here to read
43-Hire-Buses-Bandh : గుడివాడలో ఉద్రిక్తత
43-Hire-Buses-Bandh : గుడివాడ – విజయవాడ ఆర్టీసీ అద్దె బస్ డ్రైవర్ పై మానికొండ వద్ద దాడి జరగడాన్ని నిరసిస్తూ గుడివాడ ఆర్టీసీ డిపోలో ఏపీఎస్ఆర్టీసీ హెయిర్ బస్సుల యూనియన్ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో డ్రైవర్లు కండక్టర్లు బంద్ కు దిగారు. click here to read
Kavitha | శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం : కవిత
Kavitha | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : హైదరాబాద్ నగరంలో ఒకే రోజు రెండు వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఆరుగురు హత్యలకు సంబంధించిన ఘటనలపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. click here to read
Gold Rate Today | పసిడి ధర తగ్గింది.. 10 గ్రాములకు రూ.490 తగ్గుదల.. తులం బంగారం ధర ఎంతంటే?
Gold Rate Today | Gold Price Today Telugu| 1.44L/24-1.32L/22 | ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి: దేశీయ మార్కెట్లో బంగారం ధరలు శనివారం (జూలై 11) స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ మార్కెట్లో ధరలు బలహీనపడటం, డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ వంటి అంశాల ప్రభావంతో దేశీయంగా కూడా పసిడి ధరలు కాస్త దిగివచ్చాయి. అయితే గత పది రోజుల ధరల తీరును పరిశీలిస్తే బంగారం భారీ హెచ్చుతగ్గులతో ట్రేడవుతున్నట్లు స్పష్టమవుతోంది.click here to read
