టీచర్లు మరోసారి ఉద్యమానికి సిద్ధం…

14 వ తేది కలెక్టరేట్లో వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నాలు నిరసనలు
ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

నంద్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల సమయం గడిచిపోయింది. ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేరకు సమస్యలు పరిష్కారం చేయకపోవడంతో ను, మా ప్రభుత్వము అనుకున్నాం మమ్మల్ని ఇంతవరకు పట్టించుకోకపోవడంతో ఉద్యమం తప్పని పరిస్థితిలో చేపడుతున్నామని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.బసవలింగరావు పేర్కొ న్నారు. శనివారం ఏపీటీ ఎఫ్ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశాన్ని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయిన ఎం.రామచంద్ర రెడ్డి, కెవి శివయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్న నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ కలెక్టర్ జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో నిర్వహించే ర్యాలీ లు,పికెటింగ్ ల ను విజయవంతనటం చేయాలన్నారు.12వ పీఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి మద్యంతర భృతి 30శాతం ప్రకటించాలన్నారు. విద్యాహక్కు చట్టం 2009 లోని సెక్షన్ 23( 1 ) కి పార్లమెంట్లో చట్ట సవరణ చేసి సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలన్నారు.

రెండు దశాబ్దాల క్రితం డీఎస్సీ అర్హత పరీక్షలో పాసై ఉపాధ్యాయ వృత్తి చేపట్టిన ఉపాధ్యాయులను తిరిగి మరలా ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ పాస్ అవ్వాలని చెప్పటం సహేతుకంగా లేదన్నారు. మూడు సంవత్సరాల్లో టెట్ పాస్ కాకపోతే బలవంతంగా ఉపాధ్యాయ పోస్టు నుండి తొలగిస్తామని, పదోన్నతులు ఇవ్వమని సుప్రీంకోర్టు తీర్పుచెప్పటం ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నదన్నారు.పార్లమెంట్ చట్ట సవరణ ద్వారా మాత్రమేఉపాధ్యాయులకు
ఊరట లభిస్తుందన్నారు. రాష్ట్రంలో, కేంద్రం లో ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్న నేపథ్యం లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తో సంప్రదింపులు జరిపి అవసరమైతే ఒత్తిడి తెచ్చయినా విద్యాహక్కు చట్టానికి చట్ట సవరణ చేయాలని అన్నారు.

12వ పిఆర్సి అమలు చేయాల్సిన సమయం గడిచిపోయింది అన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే ప్రకటించాలని, పాత పెండింగ్ బకాయిలన్నింటిని చెల్లించాలని, నాలుగు సంవత్సరాలుగా నిలిచిపోయిన సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అన్ని డిపార్ట్మెంట్లో పదోన్నతులు నిర్వహించినప్పటికీ విద్యాశాఖ లో నేటికీ పదోన్నతులు నిర్వహించలేదన్నారు.జులై ,ఆగస్టు నెలలో పదవీ విరమణ చెందే ఉపాధ్యాయులు ఒక్క పదోన్నతి పొందకుండానే పదవి విరమణ అయ్యే పరిస్థితి నెలకొన్న ఉన్నదని అన్నారు. పాత ప్రసిడెన్షియల్ ఆర్డర్ 1975 రద్దయి నూతన ప్రసిడెన్షియల్ ఆర్డర్ 2025 అమలులోకి వచ్చిన నేపథ్యంలో 4 దశాబ్దాల పై న పోరాటం జడ్పీ మేనేజ్మెంట్ లోని అన్ని కేటగిరీ ఉపాధ్యాయులను లోకల్ కేడర్ గా ఆర్గనైజ్ చేస్తూ రాష్ట్రపతికి ప్రతిపాదన పంపాలని ప్రభుత్వాన్ని కోరారు.స్కూల్ అసిస్టెంట్ ,సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను జిల్లా కేడర్ పోస్టులుగానూ, ప్రధానోపాధ్యాయులు మండల విద్యాశాకాదికారులను పోస్టులను జోనల్ కేడర్గా ఆర్గనైజ్ చేస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్రపతికి పంపి 99 శాతం ఉన్న మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేయాలన్నారు.

2017 లో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేశారన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి కె వి. శివయ్య మాట్లాడుతూ ఈనెల 14వ తారీఖున అన్ని జిల్లా కేంద్రాల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో న్యాయమైన డిమాండ్స్ పి ఆర్ సి ,డి ఎ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు చెల్లించాలని తదిత డిమాండ్లతో ఫికెటింగ్, ర్యాలీలు నిర్వహిస్తామని ఆ ఫికెటింగ్ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు తీసుకురావలన్నారు.ఈ సమావేశంలో మాజీ జిల్లా అధ్యక్షులు ఎన్. బాలనాగిరెడ్డి మాజీ రాష్ట్ర కౌన్సిలర్ తుమ్మేటి సుకుమాంబ కుమారి జిల్లా కార్యవర్గ సభ్యులు జాకీర్ హుస్సేన్, వీరేశ్వర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి జిల్లా సబ్ కమిటీ సభ్యులు రమాబాయి, హరినాథ్ గౌడ్ ,సుబ్బారెడ్డి ,శ్రీనివాసులు, ఖాజాహుస్సేన్, మధు, దస్తగిరి భాష, రమేష్ బాబు, తిమ్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.