Karur Stampede | సీఎం విజయ్‌కు ఊరట..
Karur Stampede | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత, సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
తొక్కిసలాట ఘటనపై బహిరంగ ప్రకటనలు చేయకుండా విజయ్, రాష్ట్ర మంత్రి ఆధవ్ అర్జున, ఇతర టీవీకే నేతలను నిరోధించాలని కోరుతూ డీఎంకే జనరల్ సెక్రటరీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
సుప్రీంకోర్టు నిర్ణయం నేపథ్యంలో డీఎంకే తన దరఖాస్తును తక్షణమే ఉపసంహరించుకుంది. దీంతో ఈ అంశంపై తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. కరూర్ తొక్కిసలాట ఘటన అనంతరం బాధ్యతలు, ప్రకటనల అంశంపై తమిళనాడులో రాజకీయ వాదోపవాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.
