గురజాడ గోపాలకృష్ణ శర్మకు ఘననివాళి
నివాళులు అర్పించిన పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్..కూటమి నేతలు…
భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లోని భవానిపురం, సాయిబాబా గుడి ఆలయ పూజారి గురజాడ గోపాలకృష్ణ శర్మ పార్థివదేహానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. భవాని పురం,సౌత్ కరకట్ట సాయిబాబా గుడి ఆలయ పూజారి గురజాడ గోపాలకృష్ణ శర్మ మంగళవారం షిర్డీలో దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
విషయం తెలుసుకున్న పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వెళ్లి గోపాలకృష్ణ శర్మకు నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రగాఢ నివాళులు అర్పించారు. కూటమి నేతలు అబ్దుల్ ఖాదర్, దాడి అప్పారావు, బాదర్ల శివ తదితరులు ఉన్నారు..
