Multistarrer | సీమ బ్యాక్ డ్రాప్ అనిల్ కి కలిసొచ్చేనా…?
Multistarrer | సీమ బ్యాక్ డ్రాప్ అనిల్ కి కలిసొచ్చేనా…?
Multistarrer | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అపజయం అనేది లేకుండా వరుసగా బ్లాక్ బస్టర్స్ సాధిస్తున్న హిట్ మిషన్ అనిల్ రావిపూడి. రీసెంట్ గా వెంకీ, కళ్యాణ్ రామ్ కాంబోలో భారీ, క్రేజీ మల్టీస్టారర్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం అనిల్ రావిపూడి రూటు మార్చడం ఆసక్తిగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేయడం విశేషం. ఇంతకీ.. అనిల్ రూటు మార్చి ఏం చేస్తున్నారు…?
Multistarrer | ప్రమోషన్ల మాస్టర్..
సినీ పరిశ్రమలో ప్రమోషన్ల విషయంలో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మరోసారి తన క్రియేటివిటీని చాటుకున్నారు. ప్రతి అప్ డేట్ ను సరదాగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అందిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఆయన, ఈసారి కూడా అలాంటి కాన్సెప్ట్‌తోనే ముందుకొచ్చారు. వీడియోలో అనిల్ రావిపూడి తన టీమ్‌తో మాట్లాడుతూ, అభిమానులు తన ప్రమోషన్లను ఎంతగా ఇష్టపడతారో సరదాగా గుర్తుచేసుకున్న్నారు. అంతేకాదు, ప్రమోషన్లలో తాను మాస్టర్ అని ప్రశంసిస్తూ అభిమానులు తనకు ఖడ్గం, వీరతిలకం బహూకరించారంటూ ఫన్నీగా చెబుతారు.

Multistarrer | రాయలసీమ నేపథ్యంలో..
అయితే.. ఆ తర్వాత కథలో ఊహించని ట్విస్ట్ వస్తుంది. వెంకటేష్ ఆ ఖడ్గంతో అనిల్ రావిపూడి బొటనవేలికి చిన్న గాటు పెట్టి ఆయనకు వీర తిలకం దిద్దుతారు. అనంతరం కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి, సంగీత దర్శకుడు జీ.వి. ప్రకాష్ కుమార్ కూడా అదే విధంగా చేస్తారు. సరదాగా సాగిన ఈ వీడియో చిత్ర బృందం తమ ప్రయాణాన్ని అధికారికంగా ప్రారంభించిందనే సంకేతాన్ని అందించింది. ఈ వీడియోలో మరో ఆసక్తికర విషయం కూడా వెల్లడైంది. అది ఏంటంటే.. సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో సాగుతుందని, అయితే.. పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇలా అనిల్ తన సినిమా కోసం రూటు మార్చి రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకోవడం విశేషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రం 2027లో సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.


