సంక్షేమ సఫలీకృతుడు మంత్రి శ్రీధర్ బాబు..
మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంథని నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు.
నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెందిన 64 చెక్కులు, కళ్యాణలక్ష్మి పథకానికి చెందిన 45 చెక్కులు కలిపి మొత్తం రూ.66,46,320 మంజూరు చేయించారు. ఈ చెక్కులను శనివారం మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి శ్రీధర్ బాబు స్వయంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు.
ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు మంథని ప్రాంత అభివృద్ధి విషయంలోనూ రాజీపడకుండా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.
