ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
-కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కాజీపేట ఏసీపి ప్రశాంత్ రెడ్డి అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లతో ఏసీపీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక సూచనలు సలహాలు తెలియజేశారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని హెల్మెట్ ధరించాలని సర్పంచులు ఇందుకు గ్రామాల్లో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. హెల్మెట్ లేనిది గ్రామంలోకి ప్రవేశించవద్దని నినాదాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మండలంలో డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు ఇప్పటికే విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని, సర్పంచ్ లు పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సర్పంచులను సీఐ పులి రమేష్ తో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల సర్పంచ్లు, కానిస్టేబుల్స్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
