పడమటిగూడెంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు..

  • కేక్ కట్ చేసి మిఠాయిల పంపిణీ
  • ప్రజా సమస్యల కోసం పోరాడుతున్న నాయకుడు: కాంగ్రెస్ నేతలు

మహబూబాబాద్, నర్సింహులపేట, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం పడమటిగూడెం గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేసి, దేశ రాజకీయాల్లో రాహుల్ గాంధీ పోషిస్తున్న పాత్రను కొనియాడారు. సామాజిక న్యాయం, యువత సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఉపాధి కల్పన వంటి అంశాల కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

గ్రామ సర్పంచ్ జక్కుల ఉప్పలయ్య మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న నాయకుడు రాహుల్ గాంధీ అని అన్నారు. పేదల సంక్షేమం, సమాన అవకాశాల కోసం ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్ రెడ్డి, చిర్ర ఉపేందర్, జక్కి యాకసాయిలు, గువ్వా వెంకన్న, జొన్నగడ్డ యాకన్న, జక్కి మురళి, సురేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ చిర్ర సతీష్ తదితరులు పాల్గొన్నారు.