ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

మధిర, ఆంధ్రప్రభ: కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు శుక్రవారం మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం, యువత మరియు రైతుల సంక్షేమం కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాడుతున్నారని నాయకులు పేర్కొన్నారు. ఆయనకు ఆయురారోగ్యాలు కలిగి మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోనా ధని కుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు కర్నాటి రామారావు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మిర్యాల వెంకటరమణ గుప్తా, దేవిశెట్టి రంగారావు, రంగా శ్రీనివాసరావు, ఈది అనిల్ కుమార్, కరివేద సుధాకర్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.