గొంది మురళికి ప్రముఖుల సన్మానం

దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జ్ కం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఘనవిజయం సాధించిన సీనియర్ న్యాయవాది గొంది మురళిని శనివారం కోర్టులో ప్రముఖులు ఘనంగా శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా మురళి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో దమ్మపేట మాజీ వైస్ ఎంపీపీ , బిఆరెస్ నాయకులు దారా మల్లిఖార్జునరావు, దమ్మపేట మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొయ్యల అచ్యుతరావు, సీకే నాగార్జున, సత్యనారాయణ, యార్లగడ్డ ఈశ్వరరావు, కాలం సంధ్యారాణి, అరుణ కుమారి, భవానీ కృష్ణ యాదవ్ తదితరులు వున్నారు .
