airstrikes | 16 మంది మృతి
airstrikes | 16 మంది మృతి
airstrikes | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అమెరికా–ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు జరిగి ఉద్రిక్తతలు తగ్గుతాయనుకుంటున్న తరుణంలోనే పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ లెబనాన్‌లోని హెజ్బొల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం భారీ ఎత్తున వైమానిక దాడులు నిర్వహించింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడుల్లో సుమారు 16 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురు గాయపడినట్లు సమాచారం. అయితే మృతులు, గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇజ్రాయెల్ చేపట్టిన ఈ దాడులతో ప్రాంతంలో మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇటీవల అమెరికా–ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంతో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని భావించినప్పటికీ, తాజా పరిణామాలు ఆ ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యాయి. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఇజ్రాయెల్ అధికారిక స్పందన, హెజ్బొల్లా ప్రతిచర్య ఇంకా తెలియాల్సి ఉంది.
