బాలన్ గురించి చైతూ ఏం చెప్పాడో తెలుసా..?
బాలన్ గురించి చైతూ ఏం చెప్పాడో తెలుసా..?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్థాయిలో బాలన్ – ది బాయ్ సినిమా పలువురు సెలబ్రిటీల ప్రశంసలు దక్కించుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ ఇలాంటి సినిమా గత రెండేళ్లలో రాలేదని అభినందించగా.. ఇప్పుడు హీరో నాగచైతన్య బాలన్ – ది బాయ్ సినిమాను అప్రిషియేట్ చేశారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు ఆ మూవీ ఫీల్ లోనే ఉండిపోయానని, బాలన్ – ది బాయ్ సినిమా మర్చిపోలేని అనుభూతికి గురిచేసిందని అన్నారు. నాగచైతన్య ప్రశంసలతో మూవీ లవర్స్ లో ఈ సినిమా పై మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి.
బాలన్ – ది బాయ్ సినిమా చూసిన తర్వాత నాగచైతన్య స్పందిస్తూ.. ఈ సినిమా సరికొత్త కథ, ఆశ్చర్యపరిచే కథనం, చూపు తిప్పుకోలేని చిత్రీకరణతో ఆకట్టుకుంది. ప్రతి సీన్ ఊహకు అందకుండా సాగుతూ ఆశ్చర్యపరిచింది. ఎండ్ టైటిల్స్ తర్వాత కూడా నేను అదే ఫీల్ లో ఉండిపోయాను. ఈ సినిమా ఇచ్చిన అనుభూతి నుంచి బయటకు రాలేకపోయా. జితూ మాధవన్ స్క్రిప్ట్ ఇంప్రెస్ చేసింది. ఆయన మంజుమ్మెల్ బాయ్స్, ఆవేశం సినిమాల్లాగే ఈ చిత్రాన్ని కూడా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారు అన్నారు.

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా బాలన్ – ది బాయ్ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆవేశం ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో మంజుమ్మెల్ బాయ్స్ చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 19న హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బాలన్ – ది బాయ్ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
