బాసరలో బాలాలయం ఏర్పాటు పై స్థల పరిశీలన
- దేవాదాయ శాఖ స్థపతి, రూపకల్పన నిపుణుల బృందం సందర్శన
బాసర, ఆంధ్రప్రభ: బాసర ఆలయ అభివృద్ధి పనులను వచ్చే నెలలో ప్రారంభించేందుకు దేవాదాయ శాఖ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా గురువారం రాష్ట్ర దేవాదాయ శాఖకు చెందిన స్థపతి మోతీలాల్, రూపకల్పన నిపుణురాలు మాధవి బృందం ఆలయాన్ని సందర్శించి వివిధ ప్రాంతాలను పరిశీలించింది.
ఆలయ కార్యనిర్వహణ అధికారి అంజనీదేవి, ఆలయ స్థానాచార్యుడు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారితో కలిసి వారు ఆలయంలోని రూ.150 అక్షరాభ్యాస మండపాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా బాలాలయం ఏర్పాటు, రూ.1,000 ప్రత్యేక అక్షరాభ్యాస మండపం, రూ.150 అక్షరాభ్యాస మండపం, భక్తుల క్యూలైన్ ఏర్పాట్లపై సమగ్రంగా పరిశీలించి ఆలయ అధికారులు, ఇంజినీరింగ్ శాఖ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకుడు సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
