TelanganaCabinet | ఈనెల 30న రైతు భరోసా నిధుల విడుదల
TelanganaCabinet | ఈనెల 30న రైతు భరోసా నిధుల విడుదల
TelanganaCabinet | కేబినెట్‌కు ఆమోదం..
మధిరలో సీఎం రేవంత్ చేతుల మీదుగా పంపిణీ
రైతులకు ఆర్థిక సాయంపై ప్రభుత్వ కీలక నిర్ణయం
TelanganaCabinet | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రైతు భరోసా నిధుల విడుదలకు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నెల 30న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు.
రైతులకు ఆర్థిక భరోసా కల్పించడం, వ్యవసాయ కార్యకలాపాలకు చేయూత అందించడం లక్ష్యంగా ఈ నిధులను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు తాజా కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అర్హులైన రైతులకు సకాలంలో ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
