Mothkur పద్దెనిమిది దీపాలతో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణ!

Mothkur పద్దెనిమిది దీపాలతో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణ!

మోత్కూరు (Mothkur), ఆంధ్రప్రభ: అధిక జ్యేష్ఠ మాస అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో గల శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఆదివారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అర్చకులు పారునంది లక్ష్మణమూర్తి శర్మ 18 దీపాలతో పెద్దమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారిని పూలమాలలతో అందంగా అలంకరించి వేదమంత్రాల మధ్య అభిషేకం, అర్చన, కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కొత్తకొండ మంజుల భాస్కర్ దంపతులు, వారి కుమారులు అఖిల్ కుమార్, నాగ సాయి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కళకళలాడింది. ప్రత్యేక పూజల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Leave a Reply