అర్హులకి ఓటు హక్కు కల్పించాలి…

అర్హులకి ఓటు హక్కు కల్పించాలి…

సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : అర్హులకి ఓటు హక్కు కల్పించాలని కోరుతూ భారత దేశ ప్రభుత్వం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (సర్)అనే కార్యక్రమం రూపొందించడం జరిగిందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్ వీఎంసీ షాదీఖాన కల్యాణ మండపంలో శనివారం ప్రత్యేక ఓటర్ల సమగ్ర జాబితా సవరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్ దశ, తేదీ, సన్నాహాలు, ట్రైనింగ్, అప్లికేషను ప్రింటింగ్ పూర్తి అయ్యిందని అన్నారు.

బి.ఎల్. ఓ ఇంటింటికి వచ్చే ఎన్యుమరేషన్ జూన్15వ తేదీ నుండి ప్రారంభమవుతుందని అన్నారు. రాష్ట్రంలో బి.ఎల్.ఓ ప్రతి ఇంటికి వస్తారని ఆయన తెలియజేశారు.వారు వచ్చినప్పుడు వారి వెంట టీడీపీ బి. ఎల్. ఏ ఉండాలని ఆయన సూచించారు.ఓటర్లతో మర్యాద పూర్వకంగా మాట్లాడాలని ఆయన కోరారు. అలాగే ప్రభుత్వం పని తీరు ఎలావుందో అడిగి తెలుసుకోవలని ఆయన కోరారు. యూనిట్ ఇంచార్జి, క్లస్టర్ ఇంచార్జిలు ఈ కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించాలని అన్నారు.

బాధ్యతాయుతమైన పని సత్ ఫలితాలను అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి ఘంటా కృష్ణ మోహన్, నవణితం, నెలిబండ్ల బాలస్వామి, బత్తుల కొండా, దాసరి కనకారవు, కంచి ధన శేఖర్, వింజమూరి సతీష్, పిరియా సోము,సింగం వెంకన్న, కె. వరలక్ష్మి, కోమరిరాజేష్ తదితరులు పాల్గొన్నారు.