ప్రజారోగ్యమే లక్ష్యంగా మెగా వైద్య శిబిరం ..

ప్రజారోగ్యమే లక్ష్యంగా మెగా వైద్య శిబిరం ..

సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాలు..

భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి, “సుజనా ఫౌండేషన్” ద్వారా ప్రారంభించిన ఉచిత మెగా వైద్య శిబిరాలకు విశేష స్పందన లభిస్తుంది. పశ్చిమ లోని పేద , మధ్య తరగతి ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని నిరంతరం ఉచితంగా అందించేందుకు నిపుణులైన వైద్యులతో పరీక్షలు నిర్వహించి ఉచిత మందుల పంపిణీ చేపడుతున్నారు.

ప్రజారోగ్య సంరక్షణే లక్ష్యంగా హెచ్.బీ కాలనీలో శనివారం ప్రారంభించిన ఉచిత వైద్య శిబిరాలను పశ్చిమ ప్రజలు పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిన ఈ ఆరోగ్య శిబిరంలో పూర్తిగా ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, ఎక్స్ రే , వంటి పరీక్షలు నిర్వహించారు.జనరల్ మెడిసిన్,డెంటల్, కంటి పరీక్షలు, వంటి అనేక అనారోగ్యాలపై 130 మందికి నిపుణులైన వైద్యుల బృందం ప్రత్యేక శ్రద్ధతో చికిత్సలు అందించారు. అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు.

దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు పెద్ద ఉపశమనం లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో , సుజనా ఫౌండేషన్ ద్వారా వారాంతంలో నిర్వహిస్తున్న ఈ మెగా వైద్య శిబిరాలను పేద, మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు.

ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ కామినేని అచ్యుతరామయ్య, డాక్టర్ దిలీప్ ( జనరల్ మెడిసిన్ ) శంకర నేత్ర చికిత్సలయం డాక్టర్ వీర్ల అంకమ్మ, డాక్టర్ అశ్విత, గవర్నమెంట్ డెంటల్ హాస్పిటల్ డాక్టర్స్, మరియు టెక్నీషియన్స్ అనిల్, సంతోష్, మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, పత్తి నాగేశ్వరరావు, కూటమి నేతలు తిరుపతి అనూష, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, అల్లంకి శ్రీనివాస్, జయబాలన్,సుజనా మిత్రా కోఆర్డినేటర్లు ఈ వైద్య శిబిరంలో తమ సేవలు అందించారు..