గురుకుల సిబ్బందికి యోగా శిక్షణ..

గురుకుల సిబ్బందికి యోగా శిక్షణ..

ఆరోగ్యమే మహాభాగ్యమని అవగాహన

శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి యోగా అవసరం: అధికారులు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : యోగా ఆంధ్ర–2026 కార్యక్రమాల్లో భాగంగా శనివారం శ్రీకాకుళంలోని కార్గిల్ పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ శిబిరంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల సంస్థ అధికారులు, ప్రిన్సిపాల్స్, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిత్యం విద్యార్థుల భవిష్యత్తు కోసం విధుల్లో నిమగ్నమై ఉండే గురుకుల విద్యాలయాల సిబ్బందికి శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసాన్ని అందించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సిబ్బందితో కలిసి పలు యోగా ఆసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా ఒక ఉత్తమ మార్గమని, ప్రతి ఒక్కరూ దీనిని నిత్యకృత్యంగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ శిక్షణ శిబిరంలో సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయకర్త వై. యశోద లక్ష్మి, ఎచ్చెర్ల రెసిడెన్షియల్ విద్యాలయం ప్రిన్సిపాల్ ఎస్. పద్మజ, దుప్పలవలస ప్రిన్సిపాల్ బి. బుచ్చిరాజు, తామరపల్లి నుంచి కృష్ణతార, జిల్లా ఆయుష్ అధికారి ఉత్తమ్ రాజ్ రాణా, ప్రముఖ యోగా గురువు మురళి, జిల్లాలోని పలు రెసిడెన్షియల్ విద్యాలయాలకు చెందిన ఉపాధ్యాయులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.