Prabhas-Mahesh Suspense | ప్రభాస్, మహేష్.. సస్పెన్స్ కి తెర దించేది ఎప్పుడు..?
Prabhas-Mahesh Suspense | ప్రభాస్, మహేష్.. సస్పెన్స్ కి తెర దించేది ఎప్పుడు..?
Prabhas-Mahesh Suspense | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ హీరోలు ప్రభాస్, మహేష్.. ఇద్దరు ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్ స్పిరిట్, ఫౌజీ సినిమాలు చేస్తుంటే.. మహేష్,.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాల పై అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే.. కొత్త ప్రాజెక్టుల పై సస్పెన్స్ కొనసాగుతుంది. ఇంతకీ.. మహేష్, ప్రభాస్.. కొత్త సినిమా ఎవరితో చేయనున్నారు..? క్లారిటీ ఇచ్చేది ఎప్పుడు..?

Prabhas-Mahesh Suspense | మహేష్ బాబు – బుచ్చిబాబు.. ?
సూపర్ స్టార్ మహేష్ బాబు.. వారణాసి సినిమా షూటింగ్ పక్కా ప్లానింగ్ తో జరుగుతోంది. ఈ సినిమాని 2027 ఏప్రిల్ 7న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. అయితే.. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎవరితో అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అయితే.. మహేష్ బాబుతో సినిమా చేయాలని బుచ్చిబాబు ఓ స్టోరీ రెడీ చేయడం జరిగిందని.. ఈ కథను మహేష్ బాబుకు వినిపించడం కూడా జరిగిందని ప్రచారం జరిగింది. ఇదే విషయం పై బుచ్చిబాబుని అడిగితే.. అవును నిజమే అని చెప్పారు. అయితే.. కథ గురించి చర్చలు జరుగుతున్నాయి కానీ.. ఇంకా ఏదీ కన్ ఫర్మ్ కాలేదని చెప్పారు.

Prabhas-Mahesh Suspense | ప్రభాస్ – ఆదిత్య ధర్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం ఫౌజీ సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మూవీని ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. డిసెంబర్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరో వైపు సందీప్ రెడ్డి వంగతో చేస్తున్న స్పిరిట్ మూవీ షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత కల్కి 2, సలార్ 2 చేయాలి. ఇదిలా ఉంటే.. ప్రభాస్ తో ధురంధర్ డైరెక్టర్ ఆదిత్య ధర్ మూవీ చేయనున్నాడని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరుకు ఈ కాంబో గురించి వార్తలు వస్తున్నాయి. కానీ.. ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సస్పెన్స్ అలాగే కొనసాగుతుంది.

Prabhas-Mahesh Suspense | క్లారిటీ వచ్చేది ఎప్పుడు..?
మహేష్ బాబు – బుచ్చిబాబు కాంబినేషన్, ప్రభాస్ – ఆదిత్య ధర్ కాంబినేషన్లో మూవీ.. ఖచ్చితంగా సెట్ అయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే.. మహేష్ బాబు ఫోకస్ అంతా వారణాసి పైనే ఉంది. ఆయన ఎప్పుడూ ఒక సినిమా పూర్తైన తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తారు. అందుచేత మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావాలంటే.. కొన్నాళ్లు ఆగాల్సిందే. ఇక.. ప్రభాస్ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసేస్తుంటారు. అందుచేత ఆదిత్య ధర్ తో ప్రాజెక్ట్ ఓకే అయితే.. వెంటనే అనౌన్స్ చేసేస్తారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతం ఆదిత్య ధర్ స్టోరీ రెడీ చేస్తున్నారట. స్టోరీ లాక్ అయితే.. ప్రభాస్ ఓకే అంటే అప్పుడు అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది. చూడాలి మరి.. ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులు ఎప్పుడు ప్రకటిస్తారో..?

CLICK HERE TO READ Kotha Malupu Review | ‘కొత్త మలుపు’ మూవీ రివ్యూ…
