Upcoming Telugu Movies 2026 | బాక్సాఫీస్ వద్ద నయా ఫైట్..
Upcoming Telugu Movies 2026 | బాక్సాఫీస్ వద్ద నయా ఫైట్..
Upcoming Telugu Movies 2026 | జూన్ రెండో వారంలో రిలీజ్ అవుతున్న ‘5’ క్రేజీ సినిమాలు ఇవే!
Upcoming Telugu Movies 2026 | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సెలవులు ముగిసినా, జూన్ నెలలో సినీ ప్రేక్షకులను అలరించేందుకు వరుస సినిమాలు థియేటర్లలోకి క్యూ కడుతున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపిస్తోంది. అయితే ‘పెద్ది’ హవా ఇలాగే కొనసాగుతుండగానే.. ఈ జూన్ నెలలో మరికొన్ని క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి.
కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల నుంచి స్టార్ హీరోల భారీ ప్రాజెక్టుల వరకు అన్నీ ఈ నెలలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి రెడీగా ఉన్నాయి. మరి జూన్ రెండో వారం నుంచి థియేటర్లలో సందడి చేయనున్న ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దామా..!

Upcoming Telugu Movies 2026 |సింగ్ గీతం (జూన్ 12)..
ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలలో ‘సింగ్ గీతం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన కథాంశంతో, మ్యూజికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నడుస్తోంది. క్రియేటివ్ మేకింగ్ ఉండటంతో, ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తెలుగు సినిమా దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస్ దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
Upcoming Telugu Movies 2026 |వంద దేవుళ్లు (జూన్ 19)..
విజయ్ ఆంటోని నుంచి వస్తున్న మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘వంద దేవుళ్లు’. గత కొన్ని ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోయినా, ఈ సినిమా విషయంలో టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎమోషనల్ కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ వస్తున్న ఈ మూవీ, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. అయితే ఈ సినిమాలో వర్క్ చేసిన వారంత బిచ్చగాడు సినిమా యూనిట్ కావడంతో ఆసక్తి నెలకోంది.
Upcoming Telugu Movies 2026 |మా ఇంటి బంగారం (జూన్ 19)..
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. అగ్ర కథానాయికగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత, ఈ చిత్రంలో పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి అధ్భుతమైన స్పందన లభించింది.
Upcoming Telugu Movies 2026 |దీవానా (జూన్ 19)..
యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘దీవానా’. సాంగ్స్ పరంగా ఇప్పటికే ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. టీజర్ అందించిన ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌తో, ఈ మూవీ కచ్చితంగా థియేటర్లలో మంచి అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్ముతోంది.
Upcoming Telugu Movies 2026 |లెనిన్ (జూన్ 26)..
ఈ నెలలో అందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం ‘లెనిన్’. అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం అఖిల్ కెరీర్‌లో కచ్చితంగా ఒక భారీ కంబ్యాక్ అవుతుందని, అభిమానులు దీనిని ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. యాక్షన్ ప్యాక్డ్ కథనంతో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో వేచి చూడాలి. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ చూసి అఖిల్ ఈ సారి హిట్ కొట్టడం ఖాయం అన్నట్టు ఉంది.
ఈ జూన్ నెలలో వైవిధ్యభరితమైన కథలతో వస్తున్న ఈ సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయని ఆశిద్దాం. మరి ఈ చిత్రాలలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా ఎదురుచూస్తున్నారు?
