Sai Pallavi | ధనుష్ మూవీలో క్రేజీ రోల్!

Sai Pallavi | ధనుష్ మూవీలో క్రేజీ రోల్!

Sai Pallavi | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: సిల్వర్‌ స్ర్కీన్‌ పై తనదైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న లేడీ పవర్‌ స్టార్‌ సాయిపల్లవి, త్వరలోనే ఒక పవర్‌ ఫుల్ రోల్‌ లో కనిపించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ‘అమరన్‌’ దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న #D55 సినిమాలో ధనుష్‌ కు జోడిగా సాయిపల్లవి నటించనున్నారు. అయితే ఈ సినిమాలో సాయిపల్లవి పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ కాంబో, ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతుండటం మన ముందకు రాబోతుండటం విశేషం.

పోలీస్‌ పాత్రలో సాయిపల్లవి?
ఇప్పటి వరకు మనం సాయిపల్లవిని ఎప్పుడూ ప్రేమకథల్లో, భావోద్వేగపూరితమైన పాత్రల్లో చూశాం. కానీ, ఒక బాధ్యతాయుతమైన, కఠినమైన పోలీస్ ఆఫీసర్‌గా ఆమెను చూడటం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వనుంది. తన డ్యాన్స్‌తో మెప్పించే సాయిపల్లవి, పోలీస్ యూనిఫామ్‌లో ఎలాంటి హుందాతనాన్ని చూపిస్తుందో చూడాలని ఆమె అభిమానులు ఆత్రుతగా చూస్తున్నారు.

Sai Pallavi

‘అమరన్’లో ఒక ఎమోషనల్ అండ్ యాక్షన్ డ్రామాను అద్భుతంగా హ్యాండిల్ చేసిన రాజ్‌కుమార్, సాయిపల్లవి పాత్రను ఎంత పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశారోనని సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యతనిచ్చే సాయిపల్లవి, ఈ ఖాకీ పాత్ర కోసం ఎలాంటి హోం వర్క్ చేస్తున్నారో తెలియాల్సి ఉంది.

ఈ వార్త సామాజిక మాధ్యమంలో తెగ వైరల్‌ కావడంతో ఫ్యాన్స్‌ ఆనందానికి అవధులు లేవు. “సాయిపల్లవిని పోలీస్ ఆఫీసర్‌గా చూడటం అంటే అది మామూలు విషయం కాదు, స్క్రీన్ బద్దలైపోవాల్సిందే” అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యూనిఫామ్‌లో ఆమె లుక్ ఎలా ఉంటుందో అని ఇప్పటి నుంచే ఫ్యాన్ మేడ్ పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *