Chief Minister | ప్రత్యేక పూజలు చేసిన సీఎం

Chief Minister | ప్రత్యేక పూజలు చేసిన సీఎం

Chief Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర హోం మంత్రి అనిత కూడా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Chief Minister |
Chief Minister |

దేవాలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులకు వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదాశీర్వచనాలు అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం స్వామివారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించారు.

దర్శనం అనంతరం సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కలిసి సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ రైల్వే జోన్ కార్యాలయాన్ని సందర్శించి పలు అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

ఈ పర్యటనకు రాజకీయ, పరిపాలనా పరంగా ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ అభివృద్ధి, మౌలిక వసతులపై కీలక చర్చలు జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

CLICK HERE TO READ MORE : 1500 feet | వరికపూడిసెల..

CLICK HERE TO READ MORE :

Leave a Reply