Peddi Success | ‘పెద్ది’ సక్సెస్‌పై బన్నీ విష్.. చరణ్ రిప్లై వైరల్!

Peddi Success | ‘పెద్ది’ సక్సెస్‌పై బన్నీ విష్.. చరణ్ రిప్లై వైరల్!

Peddi Success | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ మధ్య ఉన్న అనుబంధం ఎప్పుడూ ప్రత్యేకం. తాజాగా వీరి ఇద్దరి మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ అలరిస్తోంది. ‘పెద్ది’ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయం పట్ల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనదైన శైలిలో అభినందనలు తెలియజేయగా, దానికి రామ్ చరణ్ అంతే ప్రేమగా స్పందించారు.

‘పెద్ది’ చిత్రాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారడంతో దానికి చరణ్‌ “థాంక్స్ బన్నీ.. నీ విషెస్ నాకు, మా చిత్ర బృందానికి ఎంతో ప్రత్యేకం. లాట్స్ ఆఫ్ లవ్” అని ఎంతో ఆత్మీయంగా రిప్లై ఇచ్చారు. అంతే కాకుండా నీ తదుపరి చిత్రం ‘రాకా’ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు రామ్ చరణ్ పేర్కొనడం విశేషం.

‘పెద్ది’ ప్రభంజనం
కేవలం ప్రేమపూర్వక మాటలే కాదు, ‘పెద్ది’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా రికార్డులను తిరగరాస్తోంది. విడుదలై కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 332.1 కోట్ల కలెక్షన్లను సాధించి తన సత్తా చాటుకుంది. టాలీవుడ్ అగ్ర హీరోలు ఇలా ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేసుకోవడం చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.