మల్లిఖార్జున ఖర్గే ని కలిసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

మక్తల్, ఆంధ్రప్రభ : ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన సందర్భంగా తన రాజకీయ గురువు అయిన మల్లిఖార్జున ఖర్గే ని ప్రత్యేకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు గా మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇటీవల కేరళం రాష్ట్రం లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా వారి ధీర్ఘకాల సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో ఖర్గే, రాహుల్ గాంధీ ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరిన్ని ఘన విజయాలు సాధించాలని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

Leave a Reply