మధ్యతరగతికి మోదీ ప్రత్యేక సూచనలు

మధ్యతరగతికి మోదీ ప్రత్యేక సూచనలు
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్.. ప్రపంచం ప్రస్తుతం ఎన్నో సంక్షోభాలు, సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాల కారణంగా ప్రపంచ సరఫరా వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా ధరలు అమాంతం పెరిగాయని తెలిపారు.
గత రెండు నెలలుగా ప్రజలపై భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మోదీ చెప్పారు. యుద్ధ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడుతున్నప్పటికీ, ఆ భారం ప్రజలపై మోపకుండా కేంద్ర ప్రభుత్వం భరిస్తోందని స్పష్టం చేశారు.
దేశ ప్రజలకు తన వినతిగా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని పరిమితం చేయాలని మోదీ కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగిన నేపథ్యంలో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
మధ్యతరగతి ప్రజలు ఖర్చులను తగ్గించుకోవాలని, దుబారా ఖర్చులు, ఆడంబరాలకు దూరంగా ఉండాలని ప్రధాని సూచించారు. అవసరం లేని విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలని చెప్పారు. గతంలో యుద్ధాల సమయంలో ప్రజలు దేశ ప్రయోజనాల కోసం బంగారం దానం చేసేవారని గుర్తుచేశారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే రాగి కొరత కూడా తీవ్రంగా ఉందని పేర్కొన్నారు
