మాజీ సర్పంచ్ వంగాల రాం రెడ్డికి ఘన నివాళి..

చిలుపూర్, ఆంధ్రప్రభ: జనగామ జిల్లా చిలుపూర్ మండలం నష్కల్ గ్రామ మాజీ సర్పంచ్ వంగాల రాం రెడ్డి మరణించడంతో ఆయన పార్థివ దేహానికి బుధవారం మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నివాళులర్పించారు.

నష్కల్ గ్రామానికి చేరుకున్న కడియం శ్రీహరి, రాం రెడ్డి పార్థివ దేహంపై పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ, నష్కల్ గ్రామ అభివృద్ధికి వంగాల రాం రెడ్డి చేసిన సేవలు, కృషి మరువలేనివని కొనియాడారు. ప్రజా సేవలో ఆయన చూపిన నిబద్ధత గ్రామ ప్రజలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాం రెడ్డి కుటుంబానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.