ఘనంగా బడిబాట కార్యక్రమం..

డోంగ్లి, ఆంధ్రప్రభ : డోంగ్లి మండలంలోని ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఆధ్వర్యంలో మండల విద్యాధికారి పర్యవేక్షణలో నేడు బడిబాట కార్యక్రమం నిర్వహించారు,ఈ కార్యక్రమంలో భాగంగా డోంగ్లి గ్రామంలోని 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలు, కార్యక్రమాలపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని,ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు సునీల్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఓంప్రకాష్, ఉపాధ్యాయ బృందం మరియు సిఆర్ పి మారుతి పాల్గొన్నారు.