కయా కింగ్ క్రీడాకారుడు వెంకటచరణ్ కు నగదు
కయా కింగ్ క్రీడాకారుడు వెంకటచరణ్ కు నగదు
బహుమతి అందించిన సుజనా ఫౌండేషన్…
ఎన్డీఏ కార్యాలయంలో అందజేసిన కార్యాలయ సిబ్బంది..
భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయిలో కయా కింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అనేక పథకాలను సాధిస్తున్న వెంకట చరణ్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలోని సుజనా ఫౌండేషన్ సత్కరించి రూ 5000 వేలు ప్రోత్సాహక నగదు బహుమతి అందించింది.. కుమ్మరిపాలెం కు చెందిన వెంకట చరణ్ పీ బీ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు..
గత ఏడాది కర్నూల్ లో జరిగిన కయాకింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి గోల్డ్ మెడల్ , అంతకుముందు సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నాడు, ఈ నెల 12,13 తేదీలలో ఛత్తీస్ ఘడ్ ,రాయపూర్ లో జాతీయస్థాయిలో జరగనున్న కయాకింగ్ (వాటర్ స్పోర్ట్స్) పోటీలకు ఎంపికయ్యాడు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్,భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సుజనా ఫౌండేషన్ ద్వారా ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు.ఎమ్మెల్యే సుజనాకు వెంకట చరణ్ కృతజ్ఞతలు తెలిపాడు..
