Future City | నేడు ఎఫ్‌సీడీఏ భవనాన్ని ప్రారంభింనున్న సీఎం
Future City | నేడు ఎఫ్‌సీడీఏ భవనాన్ని ప్రారంభింనున్న సీఎం
Future City | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగర అభివృద్ధిలో మరో కీలక అడుగు పడనుంది. ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫ్యూచర్ సిటీకి గ్రీన్ సింబల్‌గా నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) భవనం ఇవాళ ప్రారంభం కానుంది.
ఎఫ్‌సీడీఏ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నగర విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ లక్ష్యంగా ఫ్యూచర్ సిటీకి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.
ఫ్యూచర్ సిటీ ప్రణాళికల అమలులో ఎఫ్‌సీడీఏ కీలక పాత్ర పోషించనుంది. ఈ భవనం ప్రారంభంతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులకు మరింత వేగం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రీన్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ భవనం ఫ్యూచర్ సిటీ విజన్‌కు ప్రతీకగా నిలవనుంది.
