తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య వారికి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు.

దర్శనానంతరం బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ప్రత్యేకంగా మొక్కులు చెల్లించుకున్నట్లు పేర్కొన్నారు.

ప్రజా సేవలో మరింత నిబద్ధతతో పనిచేసేందుకు స్వామివారి ఆశీస్సులు కోరుకున్నట్లు బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ దర్శన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.