టెన్నిస్ బాల్ క్రికెట్‌లో ఎస్‌ఎస్‌కే విద్యార్థి ప్రతిభ..

ఎన్టీఆర్ జిల్లా జట్టుకు విద్యార్థి ఆనంద్ ఎంపిక


మైలవరం, ఆగస్టు3(ఆంధ్రప్రభ ) : స్థానిక ఎల్‌బీఆర్‌సీఈ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌లో ఎస్‌ఎస్‌కే పాఠశాల విద్యార్థి బి.ఆనంద్ ప్రతిభ కనబరిచి ఎన్టీఆర్ జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ గొల్లపూడి మోహనరావు మాట్లాడుతూ, ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ పోటీల్లో బి. ఆనంద్ ఎన్టీఆర్ జిల్లా తరఫున పాల్గొననున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయికి ఎంపికై పాఠశాలకు గుర్తింపు తీసుకువచ్చిన విద్యార్థి బి. ఆనంద్‌ను పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ జి. భావన, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.