నూతన ఎస్సై బాధ్యతల స్వీకరణ

సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మే 22(ఆంధ్రప్రభ) : మండల కేంద్రంలో నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ ని బిఆర్ఎస్ నాయకులు శుక్రవారం పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడు, హుజూర్‌నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ మాట్లాడుతూ..
పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో నూతన ఎస్సై సమర్థంగా పనిచేసి మండల కీర్తిని పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా పోలీస్ వ్యవస్థ మరింత ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షులు సందీప్ నాయక్, ఎల్హెచ్‌పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు వెంకట్రాం నాయక్, పులియా నాయక్, నాగు, రవీందర్, రాంబాబు నాయక్, మాజీ నీటి సంఘం డైరెక్టర్ వెంకట్ రామ్ నాయక్, విద్యా కమిటీ చైర్మన్ కోటయ్య, పాల డైరీ రవీందర్, మాజీ వార్డ్ సభ్యుడు శీను నాయక్, బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
