గంట ఆలస్యంగా సీఎం పర్యటన

గంట ఆలస్యంగా సీఎం పర్యటన

  • కిక్కిరిసిన సభా ప్రాంగణం..

భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతంలో సోమవారం పర్యటన గంట ఆలస్యంగా ప్రారంభం అయ్యింది. ఉదయం 11 గంటలకు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామ హెలిప్యాడ్‌కు చేరుకోవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుమారు గంట ఆలస్యంగా చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు , నాయకులు సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

12:15 గంటలకు గ్రామ సభ వేదికకు చేరుకొని పట్టాదార్ పాస్‌బుక్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.