పశ్చిమగోదావరి జాయింట్ కలెక్టర్‌గా కె.ఆర్. కల్పశ్రీ

భీమవరం, ఆంధ్రప్రభ: పశ్చిమగోదావరి జిల్లా నూతన జాయింట్ కలెక్టర్‌గా కె.ఆర్. కల్పశ్రీ శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పి. ప్రభాకర్, సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు టి. మోహన్ రాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి (ఏఓ) వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.