Kanpur Viral Marriage | ఓ అల్లుడి ప్రేమ‌క‌థా చిత్రం

Kanpur Viral Marriage | ఓ అల్లుడి ప్రేమ‌క‌థా చిత్రం

Kanpur Viral Marriage | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దేహాత్ జిల్లాలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన భార్యను వదిలి, అత్తతో కోర్టులో మ్యారేజ్ చేసుకోవ‌డం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల ప్రకారం.. పెళ్లి తర్వాత అత్తగారింటికి రాకపోకలు సాగిస్తున్న సమయంలో అల్లుడు, అత్త మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అనంతరం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లి కోర్టులో వివాహం చేసుకున్నారు. తాము పరస్పర అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని, సమాజం తమ నిర్ణయాన్ని అంగీకరించాలని కోరుతూ సోష‌ల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.

ఈ వీడియో వైరల్ కావడంతో స్థానికంగా ఈ వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన ఈ పరిణామం సామాజికంగా వివాదాస్పదంగా మారింది. ఘటన అనంతరం ఆ ఇద్దరూ కనిపించకుండా వెళ్లిపోయారని, పోలీసులు వారి కోసం గాలిస్తున్నట్లు తెలిసింది.