Earthquake | రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు

Earthquake | రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు

Earthquake | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఫిలిప్పీన్స్‌లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు నమోదవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

భూకంప తీవ్రతను రిక్టర్ స్కేలుపై 7.8గా గుర్తించినట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. శాంటోస్ నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు.

భూకంప ప్రభావంపై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.