ఖతర్‌లో నర్సింగ్ ఉద్యోగాలు..
ఖతర్‌లో నర్సింగ్ ఉద్యోగాలు..
నెలకు రూ.1.30 లక్షలకుపైగా వేతనం
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఖతర్ రాజధాని Dohaలో హోమ్ కేర్ నర్స్, రిజిస్టర్డ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం తెలిపారు.
హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం నర్సింగ్ లేదా పోస్ట్ బీఎస్సీ నర్సింగ్ అర్హతతో పాటు కనీసం రెండేళ్ల నర్సింగ్ అనుభవం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రాథమిక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1.30 లక్షలకుపైగా వేతనం లభించే అవకాశం ఉందని వెల్లడించారు.
ఆసక్తి గల అభ్యర్థులు తమ పాస్‌పోర్ట్, విద్యార్హతలు, అనుభవ ధ్రువపత్రాలతో జూన్ 8లోపు AP State Skill Development Portalలో నమోదు చేసుకోవాలని సూచించారు.
మరిన్ని వివరాల కోసం 91609 12690, 99888 53335 నంబర్లను సంప్రదించాలని ఆర్. లోకనాథం తెలిపారు.
