ఎన్డీఏ కార్యాలయంలో 11 వ రోజు ప్రజా దర్బార్

ఎన్డీఏ కార్యాలయంలో 11 వ రోజు ప్రజా దర్బార్

కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

భవానిపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో 11వ రోజు శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. సామాజిక పెన్షన్లు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు, నూతన ఇంటికొరకు దరఖాస్తులు, తాగునీటి ఇబ్బందులు ,వైద్యం సాయం తదితర అంశాలపై ప్రజలు వినతులను అందజేశారు.

ఆయా సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.పశ్చిమ నియోజకవర్గం లోని సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి నిరంతరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజా దర్బార్ లను నిర్వహిస్తున్నారని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కూటమి నేతలు పీవీ చిన సుబ్బయ్య, మహ్మద్ అబ్దుల్ ఖాదర్ , కామ దేవరాజ్, దుర్బేసుల హుస్సేన్, శ్రీ చల్లంరాజు వెంకట శేషయ్య ఎండోమెంట్ ట్రస్ట్ చైర్మన్ ముదిగొండ శివ బొమ్ము గోవింద లక్ష్మి, తిరుపతి అనూష, బొల్లెపల్లి కోటేశ్వరరావు చొక్కా నరేష్ తెలిపారు