ప్రజా దర్బార్‌తో ప్రజా స్నేహం..

ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

పాయకాపురం, ఆంధ్రప్రభ : పదవి అనేది అలంకారం కాదని, బాధ్యత అని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు.సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించారు.

కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇంతటి భారీ మెజారిటీతో గెలిపించిన నేపద్యంలో ప్రజలకు,ప్రజా ప్రతినిధులకు మధ్య దూరం ఉండకూడదనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను నేరుగా పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యాలయ ఇంచార్జి ఘంటా కృష్ణ మోహన్, పి.ఏలు భార్గవ్, శివ, టీడీపీ నాయకులు పార్లమెంట్ కార్యదర్శి ఎస్. కె గౌసియా, క్లస్టర్ ఇంచార్జి బత్తుల కొండా తదితరులు పాల్గొన్నారు.