Devji Health Update | త్వరగా కోలుకోవాలన్న టీఆర్ఎస్ అధినేత్రి

Devji Health Update | త్వరగా కోలుకోవాలన్న టీఆర్ఎస్ అధినేత్రి

Devji Health Update | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : అనారోగ్యంతో చికిత్స పొందుతున్న మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కొంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవ్‌జీని ఆమె స్వయంగా కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

దేవ్‌జీకి అందుతున్న వైద్య సేవల గురించి ఆసుపత్రి వైద్యులతో కవిత చర్చించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో, ఎలాంటి చికిత్స అందిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించి ఆయన త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను కోరారు.

దేవ్‌జీ కుటుంబ సభ్యులతో కూడా కవిత మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. కాగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన దేవ్‌జీ కొన్ని నెలల క్రితం దాదాపు 40 ఏళ్ల అజ్ఞాత జీవితానికి ముగింపు పలికి పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం సాధారణ జీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాజీవితాన్ని కొనసాగిస్తున్నారు.