నిరుపేద బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం..
తొర్రూరు, ఆంధ్రప్రభ : మండలంలోని వివిధ గ్రామాలలో నిరుపేద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,మడిపల్లి మాజీ ఎంపిటిసి జక్కా మహబూబ్ రెడ్డి అన్నారు.పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టిపిసిసి ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డిల ఆదేశాల మేరకు మండలంలోని మడిపల్లి గ్రామానికి చెందిన కిన్నెర రమణమ్మ ఇటీవల మృతి చెందడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు మహబూబ్ రెడ్డి,ఇంద్రసేనారెడ్డిలు శుక్రవారం బాధిత కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అనంతరం బాధితులకు 25 కేజీల బియ్యం, రూ.3 వేల నగదును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డిల సహకారంతో మండలంలోని నిరుపేద బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటామన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు సకాలంలో చేరే విధంగా కృషి చేస్తామన్నారు. పేదలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మడిపెల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెన్నం సోమిరెడ్డి,మాజీ సర్పంచ్లు రావుల వెంకటరెడ్డి,గడీల మాధవి సాయిలు,గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు, ఎండి యాకూబ్,చల్ల మీనారెడ్డి,మహంకాళి సంపత్,యర్రం రాజు యాదవ్, అబ్బనపురి వెంకటాచారి చెడుపల్లి శ్రీను, బాల్య ఐలయ్య,వేల్పుల హరీష్, వేల్పుల భార్గవ్, తూర్పాటి నాగరాజు, పస్తం సైదులు, తూర్పాటి జిందాసాహెబ్, కిన్నెర జగన్నాథం, తూర్పాటి అర్జున్, తూర్పాటి సారయ్య, తూర్పాటి పిచ్చయ్య, తూర్పాటి ముత్తమ్మ, అల్లం సైదమ్మ, కిన్నెర సంతోష్,వేల్పుల మంజుల, వేల్పుల ఎర్రింకులు, వేల్పుల ఎల్లమ్మ, వేల్పుల రాధా తదితరులు పాల్గొన్నారు.
